BREAKING
కొలువుతీరిన తిరుపతి నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రజావాణిలో ఒకే ఒక్క దరఖాస్తు పదవులను బాధ్యతగా భావించి ప్రజాసేవ చేయాలి: తాళ్ళ వెంకటేష్ యాదవ్ నోయెల్ టాటా లేఖతో కీలక మలుపు... గ్రామ సభల్లో ఎల్ నినో ముప్పుపై అవగాహన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గోల్డ్ స్పాట్ కమ్‌బ్యాక్ కస్తూర్బా విద్యార్థినులకు పోలీసుల అవగాహన ఐదవ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థి దండా వెంకట వంశీకృష్ణ విస్తృత ప్రచారం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ & జోనల్ కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య గ్రామం లోని పలు వార్డులలో సాయిబాబా ఎన్నికల ప్రచారం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. 27న ఒంగోలులో జన విజ్ఞాన వేదిక రాష్ట్రస్థాయి వక్త పోటీలు దీపాల కాంతుల్లో వెలిగిన భక్త మార్కండేశ్వర స్వామి ఆలయం !! నర్సాపూర్‌లో రూ.87 లక్షల చెక్కుల పంపిణీ…కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డ ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

​గుంటూరు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. సోమవారం శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత రెండున్నరేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కూటమి విజయం సాధించడం ప్రభుత్వ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ బీసీలకు 34 శాతానికి పైగా, మహిళలకు 45 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు.​గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీలు, గుంటూరు నగరపాలక సంస్థకు వచ్చిన నిధులు పక్కదారి పట్టాయని, కనీస మౌలిక సదుపాయాల కల్పన నిర్లక్ష్యానికి గురైందని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని విమర్శించిన ఆమె, గ్రామాల అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఇన్‌ఛార్జి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల గుంటూరు నగరపాలక సంస్థలోని 76 డివిజన్లకు గాను 64 డివిజన్లలో కూటమిని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తుందని గుర్తుచేస్తూ, గ్రామాల సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్