BREAKING
క్రిస్మస్ కానుకగా చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం-తిప్పన విజయేందర్ రెడ్డి 1008 జ్యోతులతో మహాశివునికి విశేష పూజలు పాల్గొన్న ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ ఛైర్మన్‌ ధర్మవరం సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం నగరం మండలంలో నామినేషన్లు పరిశీలన అనంతరం120 మంది సర్పంచ్ పదవికి, 501 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు ఖరారు కుందుర్పి మండలం అప్పిలేపల్లి గ్రామంలో కత్తెరకు అపూర్వ స్పందన. చిందుకూరు సర్పంచుగా సంపంగి వెంకటస్వామి ఏకగ్రీవ ఎన్నిక విజ్ఞాన యాత్రలో నగరం మండల రైతులు ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ కీ షాదీ' చిత్రంపై సూరజ్ బర్జాత్యా బిగ్ అప్‌డేట్.. మరికొంత సమయం పడుతుందన్న దర్శకుడు స్వేచ్ఛగా ఓటేయండి. అహోబిలంలో పోలీసుల కవాతు మూడేళ్ల ప్రేమ బంధానికి బ్రేకప్.. విడిపోయిన 'ది గ్లోరీ' తారలు లిమ్ జీ యోన్, లీ డో హ్యూన్ సర్పంచ్ గా గెలిపించండి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తిరుమలరెడ్డి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యం: పెరిక సురేష్ ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ కార్తిక శోభ'- * చెరువుగట్టు క్షేత్రం.. భక్తజన సంద్రం చిట్టమూరు ఉప సర్పంచ్‌గా పఠాన్ బషీర్ ఖాన్ ఏకగ్రీవ ఎన్నిక టీడీపీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం..వివిధ హోదాల్లో పార్టీకి సేవలు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

Select Suryaa Now
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

గిద్దలూరు, మేజర్‌న్యూస్‌ :

గిద్దలూరు మున్సిపల్ కార్యాలయం నందు పురపాలక సంఘం నూతన పాలకవర్గ పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు వైస్ చైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మున్సిపల్ చైర్మన్ డా. జె.వి. నారాయణ గారు, వైస్ చైర్‌పర్సన్ పాలుగుల్ల శ్రీదేవి గారితో పాటు మొత్తం 28 వార్డుల కౌన్సిలర్లచే ప్రత్యేక అధికారి, DRDA పీడీ, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. గిద్దలూరు పట్టణ ప్రజలు తమపై మరింత బాధ్యతను ఉంచారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నూతన మున్సిపల్ పాలకవర్గం సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేస్తూ, నూతన చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ మరియు కౌన్సిలర్ల సమన్వయంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేస్తామని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, గిద్దలూరు పట్టణాన్ని అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్‌పర్సన్ మరియు కౌన్సిలర్లను ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.