BREAKING
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి గర్భిణీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త: 'ప్రధానమంత్రి మాతృ వందన యోజన' కింద రూ. 6,000 వరకు ఆర్థిక సాయం.. అర్హతలు, ప్రయోజనాల పూర్తి వివరాలు వాల్ స్ట్రీట్ టెక్ బుల్స్ మళ్లీ రంగంలోకి: 3 శాతానికి పైగా దూసుకెళ్లిన నాస్‌డాక్ ఫ్యూచర్స్ .. ఈ భారీ ర్యాలీకి 3 ప్రధాన కారణాలివే! బండి సంజయ్ మహా పాదయాత్రకు మానకొండూరు నుంచి భారీగా తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి గట్టుదుద్దెనపల్లి సొసైటీలో రూ.లక్షలు హాంఫట్..? - పైపు లీకేజీ పేరిట బంకులో రూ.52 లక్షలు స్వాహా? వేమవరంలో స్వతంత్ర అభ్యర్థి రాజ్యలక్ష్మి ముమ్మర ప్రచారం సారస్వత నికేతనం సందర్శించిన ఆర్థిక రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ - అరుదైన గ్రంథాలు, తాళపత్రాలు, చారిత్రక సంపద పరిశీలన కళ్యాణదుర్గం మండలం బట్వానిపల్లి గ్రామంలో మేతకు వెళ్లిన గొర్రెలు మేకలు మృతి. కూటమి ప్రభుత్వంలో ప్రగతి పథంలో పల్లెలు : టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ డేటా ఆధారిత నిర్ణయాలతో పాలనలో మెరుగైన ఫలితాలు ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిఠాపురం మున్సిపాలిటీలో భగ్గుమన్న జనసేన అసమ్మతి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నగరం మండలంలో 141 మంది సర్పంచ్ పదవికి, 507 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు కూటమి అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు విసృత ప్రచారం

ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్

Select Suryaa Now
ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్

 

కర్నూలు, నవంబర్ 22:

ఆర్యవైశ్యులందరూ కలిసిమెలిసి ఉంటూ తమ ఐక్యతను చాటుకోవాలని, అప్పుడే అన్ని రంగాల్లో తగిన గౌరవం, గుర్తింపు లభిస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.

కర్నూలులోని సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్తీక మాస వనబోజన మహోత్సవం – ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రసంగించారు. కర్నూలులో గత 11 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సంస్థలు కలిసి ఈ వనబోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, అదే స్ఫూర్తితో రాజకీయంగా కూడా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. తాను కూడా ఆర్యవైశ్యులకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నానని తెలిపారు. గత ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్లు కేటాయించడంతో పాటు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించామని, భవిష్యత్తులోనూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజలు తనకు ఇచ్చిన అవకాశంతో మంత్రిగా కర్నూలు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. ఓర్వకల్లులో సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని, రిలయన్స్ వంటి సంస్థలు ఓర్వకల్లుకు రావడం ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. సమాజానికి మంచి చేసే వారికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలవాలని కోరారు. ప్రతి ఒక్కరూ గోసేవకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగర శివారులోని గాయత్రి గోశాల వద్ద వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కృషి చేస్తున్నానని, కర్నూలు నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు, మహోత్సవ నిర్వహణకు సహకరించిన దాతలకు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. లక్కీ డిప్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.