బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్
గుంటూరు : బాపట్ల సముద్ర తీరాన ఉవ్వెత్తున ఎగసిపడే అలలకు పోటీ పడుతూ కూటమి అభ్యర్థులు ప్రజల్లో ఆదరణ పొందుతున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు. ఆదివారం బాపట్ల మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎంపీ కృష్ణప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి నరాలశెట్టి మౌనిక, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షబ్బీర్ అహ్మద్ కు మద్దతుగా ఓటర్ల వద్దకు వెళ్లి కూటమి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ విద్య వికాసానికి నిలయంగా ఉన్న బాపట్ల ఓటర్లు చైతన్యం కలిగి ఉంటారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో అన్ని రంగాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధోగతి పాలైన రాష్ట్రాన్నిఆర్థిక శక్తిగా మారుస్తున్నట్లు తెలిపారు. బాపట్ల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పురపాలక సంఘంలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సమస్యలను కూటమి అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కూటమి నేతలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, స్థానిక మునిసిపాలిటీలోనూ కూటమి కౌన్సిలర్లు, చైర్మన్ గెలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు రాబట్టుకోవడం సులభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు
సూర్య నాయక్