BREAKING
డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. కేసును ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్ ఆర్యవైశ్యుల ఐక్యతతోనే అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్ బాపట్ల ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నసీర్ కలయకాగొల్లులో వైసీపీ ఖాళీ.. తెలుగు దేశంలోకి 70 కుటుంబాలు పనులు పూర్తయ్యాక బిల్లుల సంగతేంటి?.. పీఏసీ భేటీలో జగ్గారెడ్డి సూటి ప్రశ్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపీని కలిసిన కొత్త కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు గాంధీ భవన్‌లో ముగిసిన పీఏసీ సమావేశం.. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం ప్రశాంతమ్మకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక

Select Suryaa Now
మర్పల్లిలో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి 200 మంది చేరిక

మర్పల్లి, మేజర్ న్యూస్: వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ కర్నే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ సమక్షంలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో తుమ్మలపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కర్నే రాజు పేర్కొన్నారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు, నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు గ్రామాభివృద్ధికి సమష్టిగా పనిచేస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల, తుమ్మలపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.