ఘనంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదిన వేడుకలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దంపతులు కలిసి భారీ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో వీపీఆర్ కార్యాలయం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం వేడుకలకు విచ్చేసిన వారందరికీ వీపీఆర్ కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు.