నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq
కర్నూలు, నవంబర్ 22:
కర్నూలు నగరంలోని తన నివాసంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు మంత్రి తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో మంత్రి టీజీ భరత్ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రజలు తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కర్నూలు నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కర్నూలు నగర మేయర్ బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో పాటు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పాల్గొన్నారు.