BREAKING
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం... రాజకీయాల్లో ఐదేళ్లకోసారి బ్యాలెన్స్ షీట్.. రెండోసారి అధికారంలోకి రావడం ఖాయం పొదిలి పట్టణంలోని అమ్మవారి శాలలో జరిగిన ఆర్యవైశ్య కార్తీకమాస వనభోజనాలు డాక్టర్ శ్రీ మస్తాన్ భాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా దూదేకుల అసోసియేషన్ షాబాద్‌ మండలంలోని పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు నూతన కార్పొరేటర్లకు మంత్రి టీజీ భరత్ ఆత్మీయ తేనీటి విందుq డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రభాస్ మద్దతు.. ప్రత్యేకంగా ఆహ్వానించిన కిషన్‌రెడ్డి వేమిరెడ్డి దంపతుల ఆతిథ్యంలో వీపీఆర్ నివాసంలో ప్రముఖులకు విందు మహిళా హత్య కేసును 24 గంటల్లోనే.. ఛేదించిన చేవెళ్ల పోలీసులు, నిందితుడి అరెస్ట్

“ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం...

Select Suryaa Now
“ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం...

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల విజయాన్ని అభినందించిన ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్  ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్, జనసేన పార్టీ నాయకులు, నా ఆత్మీయ మిత్రులు శ్రీ జానీ మాస్టర్  నెల్లూరులోని మా నివాసానికి విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు కిషోర్ గునుకుల తెలిపారు.  ఇటీవల 21వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించిన తన సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గునుకుల  ని జానీ మాస్టర్ మా ఇంటికి విచ్చేసి ప్రత్యేకంగా అభినందించడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ…

జానీ మాస్టర్ కేవలం ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు. తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయికి ఎదిగి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ తన స్నేహాన్ని, ఆత్మీయతను, తనవారిపై ఉన్న అభిమానాన్ని మరచిపోని గొప్ప మనసున్న వ్యక్తి.  “వెండితెరపై తన స్టెప్పులతో కోట్లాది మందిని అలరించిన జానీ మాస్టర్… నిజ జీవితంలో తన స్నేహంతో మా ఇంటికి వచ్చి మా ఆనందాన్ని పంచుకోవడం మాకు మరపురాని అనుభూతి.”  శ్రీ పవన్ కళ్యాణ్  నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో రాజకీయ ప్రయాణంలో భాగస్వామి కావడం అభినందనీయం.  21వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి  విజయం సాధించిన సందర్భంగా ప్రత్యేకంగా మా ఇంటికి విచ్చేసి అభినందనలు తెలియజేయడం జానీ మాస్టర్‌కు మా కుటుంబంపై, మా స్నేహంపై ఉన్న అభిమానానికి నిదర్శనం.  ఈ విజయం కేవలం ఒక వ్యక్తి విజయం కాదు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి, జనసేన కార్యకర్తల కష్టానికి, ప్రజల ఆశీర్వాదానికి ప్రతిరూపం. జానీ మాస్టర్ వంటి ప్రముఖ మిత్రులు మా ఇంటికి వచ్చి ఈ విజయాన్ని పంచుకోవడం మా బాధ్యతను మరింత పెంచింది.  సినిమాల్లో తన ప్రతిభతో ప్రేక్షకుల హృదయాలను గెలిచారు… రాజకీయాల్లో ప్రజాసేవతో ప్రజల మనసులను గెలుచుకోవాలని నా మిత్రుడికి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.  ఈ ఆత్మీయ సందర్శన మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. నా మిత్రుడు జానీ మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.