BREAKING
రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు ఇబ్బందుల్లో ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. ఎం. జయసింహాద్రి ఎన్నిక ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోర్ల దంపతులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద హైడ్రామా.. జగన్ ఇంటికి వెళ్లకుండా షర్మిల, విజయమ్మలను అడ్డుకున్న పోలీసులు ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ...... మెగా రక్తదాన, ఉచిత కంటి వైద్య శిబిరం గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కోలాహలంగా కోడూరు తీరం..! - ప్రజల రాకపోకలతో సందడి..!! కార్తీక మాస వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న మేయర్ లక్ష్మీ అపర్ణ ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ చూపాలి* చెంచులక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ముత్తుకూరు తెదేపా సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత: ఎస్పీ విక్రాంత్ పాటిల్ “ఎదగడం ఒక విజయం… ఎదిగిన తర్వాత తనవారిని గుర్తుపెట్టుకోవడం ఒక గొప్ప సంస్కారం...

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ

Select Suryaa Now
ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ విధానంలో పారదర్శకంగా ఎరువుల పంపిణీ

వెల్దుర్తి,  మేజర్ న్యూస్: వెల్దుర్తి పట్టణంలోని అధీకృత ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు 'ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్' (ఎఫ్‌ఎఫ్‌ఎస్) విధానంలో రాయితీ ఎరువులను పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చన్నారు. బుకింగ్ పూర్తయిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్‌ను కేటాయించిన దుకాణాల్లో చూపించి, ధ్రువీకరణ అనంతరం నిర్ణీత ధరకు ఎరువులు పొందవచ్చని వివరించారు. సబ్సిడీ ఎరువులు నిజమైన రైతులకే అందేలా చూడటంతో పాటు పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నూతన విధానం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందుతాయని ఎంఏఓ స్పష్టం చేశారు.