కోలాహలంగా కోడూరు తీరం..! - ప్రజల రాకపోకలతో సందడి..!!
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్ : జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప ర్యాటకులతో తోటపల్లిగూడూరు మండలం కోడూరు సముద్ర తీ రంలో ఆదివారం కోలాహల వా తావరణం నెలకొంది. దాంతో తీ రం వెంబడి సందడి వాతావర ణం ఏర్పడింది. ఇది మైపాడు బీ చ్ తర్వాత జిల్లాలో ప్రసిద్ధి చెంది న తీర ప్రాంతాల్లో ఒకటి. సహజ సిద్ధమైన ఇసుక తిన్నెలు, ప్రశాం తమైన వాతావరణం ఈ బీచ్ ప్ర త్యేకతలు. దాంతో వారాంతాలు మరియు సెలవు దినాల్లో పర్యా టకుల సందడి ఎక్కువగా ఉం టుంది. కాగా వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు కో డూరు తీరానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజల రాకపోకలు సాగాయి. కుటుంబాల సమేతంగా కదలి వ చ్చి తీరం వెంబడి సందడి చేశా రు. ముఖ్యంగా యువత ఆటపా టలతో సందడి చేసింది. ఈ సం దర్భంగా ఎటువంటి అవాంఛనీ య సంఘటనలు సంభవించకుం డా తీరం వెంబడి గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు అయ్యిం ది. గతంలో సంభవించిన ప్రమా దాలను పరిగణలోకి తీసుకొని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో లోతుకు వె ళ్ళకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. ఏదేమైనా భారీ సంఖ్య లో తరలి వచ్చిన పర్యాటకుల తో కోడూరు బీచ్ కళకళ లాడు తూ కనిపించింది.