BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ

Select Suryaa Now
జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ

ఒంగోలు, మేజర్‌న్యూస్‌:

 సహజ ప్రసవాల ప్రాధాన్యత, గర్భిణులకు గౌరవప్రదమైన ప్రసూతి వైద్య సేవల ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్), ఒంగోలులో ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా (SOMI) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన Nationwide Walk for Natural Birthing కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టారు. జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ఏడుకొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సహజ ప్రసవాల ప్రోత్సాహం, అవసరం లేని సిజేరియన్ ఆపరేషన్ల నివారణపై వైద్యులు, సిబ్బంది, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జీజీహెచ్ గైనకాలజీ విభాగానికి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సహజ ప్రసవాల ప్రాధాన్యతను వివరిస్తూ నినాదాలు చేశారు.

సిజేరియన్ ఆపరేషన్ అనేది ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య విధానమని, దానిని సాధారణ ప్రసవానికి ప్రత్యామ్నాయంగా కాకుండా వైద్యపరంగా అవసరమైన సందర్భాల్లో మాత్రమే వినియోగించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతలో సహజ ప్రసవాలపై అవగాహన పెంపొందించడం, గర్భిణులకు గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ అందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు సహజ ప్రసవాలను ప్రోత్సహించడంలో వైద్యులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.