పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు
పూతలపట్టు మేజర్ న్యూస్ :
పూతలపట్టు మండల పరిధిలో దట్టమైన పొగమంచు జనజీవనాన్ని, రహదారి రాకపోకలను తీవ్రంగా స్తంభింపజేసింది తెల్లవారుజాము నుంచే మంచు తీవ్రత అధికంగా ఉండటంతో రహదారులు పూర్తిగా పొగమంచు దుప్పటితో కప్పబడిపోయాయి. సాధారణంగా ఎండ రాగానే మంచు కరిగిపోతుంది కానీ, ఉదయం 9 గంటల సమీపానికి చేరుకుంటున్నప్పటికీ మంచు తెరలు ఏమాత్రం వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు రహదారిపై కేవలం కొన్ని మీటర్ల దూరం కూడా స్పష్టంగా కనిపించని పరిస్థితి తలెత్తడంతో ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించడం కష్టంగా మారిందని వాహనదారులు,ప్రయాణికులు చెబుతున్నారు దీనితో ముందుకెళ్లే ధైర్యం చేయలేక ద్విచక్ర వాహనదారులు, కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాల చోదకులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేసి, మంచు తగ్గే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది
మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా రహదారిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది తక్కువ దృశ్యమానత కారణంగా రహదారిపై అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పొగ మంచు కారణంగా రహదారిపై ఆగ్రోటెక్ ఫ్యాక్టరీ సమీపంలో ద్విచక్ర వాహనం ప్రమాదనికి గురై గాయపడిన వారిని అంబులెన్సు సాయంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం మంచు వల్ల ఎదురవుతున్న ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. రోడ్డు మలుపులు, డివైడర్లు, ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో అత్యవసర పనులపై బయటకు వచ్చిన ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది పొగమంచు కురుస్తున్న సమయాల్లో వాహనదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని యన్ హెచ్ ఐ అధికారులు సూచిస్తున్నారూ మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అతివేగానికి వెళ్లకుండా, హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్లు, పార్కింగ్ లైట్లు తప్పనిసరిగా వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాలని పూతలపట్టు సీఐ తిమ్మాయ్య పేర్కొంటున్నారు. అలాగే, రోడ్డుపై వాహనాలను నిలిపివేయాల్సి వస్తే, వెనుక వచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా సురక్షితంగా రోడ్డు పక్కకు నిలపాలని, వీలైతే మంచు పూర్తిగా తగ్గే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్