BREAKING
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు పిఠాపురం తరహాలో రేణిగుంటను అభివృద్ధి చేస్తాం..….... జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ వైఫల్యం *నూతన కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు* అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ? *ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం * ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గంగవరం మండల యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా ధ్యేయం- సర్పంచ్ అభ్యర్థి సతీష్ *నూతన వధూవరులను ఆశీర్వదించిన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు* సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు *ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా* ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం?

తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై

Select Suryaa Now
తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు..  ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై

​పూతలపట్టు మేజర్ న్యూస్ :

పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు అత్యంత రసవత్తరంగా మారింది. ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది

​పంచాయతీ పరిధిలో మొత్తం 531 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ, సర్పంచ్ పదవికి ఇంత భారీ సంఖ్యలో పోటీ నెలకొనడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తక్కువ ఓట్లు ఉన్న ఈ చిన్న పంచాయతీలో 11 మంది బరిలో నిలవడంతో విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది బరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో ఓట్లు చీలే అవకాశం ఉందని, ఫలితంగా ప్రతి ఒక్క ఓటు అత్యంత కీలకంగా మారిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఇప్పటి నుంచే ఇంటింటి ప్రచారానికి, ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు పదును పెడుతున్నారు​మరోవైపు, గ్రామాన్ని ఏకగ్రీవం చేసి అభివృద్ధి నిధులను సాధించుకోవాలన్న గ్రామ పెద్దల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 15 లక్షల ప్రత్యేక ప్రోత్సాహక నిధులు ఈసారి తిమ్మిరెడ్డిపల్లికి అందని పరిస్థితి ఏర్పడింది సర్పంచ్ పదవికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఏకగ్రీవ ప్రయత్నాలకు పూర్తిగా తెరపడింది రూ. 15 లక్షల నిధులు చేజారిపోవడంపై గ్రామస్థుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ​ఇక పంచాయతీ పరిధిలోని వార్డుల విషయానికొస్తే మొత్తం ఎనిమిది వార్డుల్లో నాలుగు వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి మిగిలిన నాలుగు వార్డులకు మాత్రం పోటీ నెలకొనడంతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అయితే, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు అసలు సమరం ఎలా ఉండబోతోందో స్పష్టత రాదు పెద్దల బుజ్జగింపులతో ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, లేక 11 మంది అభ్యర్థులు తుది బరిలో నిలిచి హోరాహోరీగా తలపడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్