*ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా*
కోహెడ;ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రతీ కుటుంబానికి భరోసా ఇస్తుందని కోహెడ మండలంలోని వింజపల్లి గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పథకంలో పేరు నమోదుకు ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పేద కుటుంబాల కోసం కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.