BREAKING
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం సర్పంచ్ రాధిక రామగౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా

*శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం*

Select Suryaa Now
*శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం*

కోహెడ;శ్రీరాములపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గడప ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు.వేద బ్రాహ్మణులైన ప్రసాద్ రావు శర్మ, విద్యాధర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాల నడుమ శాస్త్రోక్తంగా గడప ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పోలు శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరి సహకారం, భక్తుల భాగస్వామ్యంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమని, ఈ పవిత్రమైన కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి జాలిగం రమేష్,ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు వేముల వీరస్వామి,సకినాల రమేష్,గ్రామ పెద్దలు,ప్రజా ప్రతినిధులు,మహిళలు,యువకులు,భక్తులు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.