పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : అమ్మా... పోలేరమ్మ.... ఆశీస్సులు అందించమ్మా అంటూ కృష్ణపట్నం గ్రామ దేవత మొలక పోలేరమ్మ తల్లికి కృష్ణపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాగాల శివకృష్ణతోపాటు కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఆదివారం భారీగా జన సందోహం మధ్య బస్టాండ్ సెంటర్ కేంద్రంగా అమ్మవారి నిలువ రాయవద్ద దేవతకు పూజలు చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కృష్ణపట్నం సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న నేపథ్యంలో గ్రామ దేవతకు మొదట పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో బయలుదేరి ర్యాలీగా ముత్తుకూరు మండల కేంద్రం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొనిగి ఆనందయ్య, మామిడాల శ్రీనివాసులు, గోవిందయ్య, జనార్ధన్, వెంకటాద్రి, కారంచేటి శివరామ ప్రసాద్ శర్మ, రమణయ్య, వెంకటసుబ్బయ్య, పార్టీ కార్యకర్తలు, రెండు గ్రామాల మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు