వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా
ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఉన్నత విద్యావంతురాలు... నిరాడంభరత.... సేవాగుణం.... వైద్య నైపుణ్యం.... సామాజిక సేవా అభిలాష.....బొమ్మిరెడ్డి కుటుంబ సేవల స్ఫూర్తి..... ఇటు వైద్యసేవల సంతృప్తి..... అటు ప్రజాసేవల సంకల్పం.....ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యం..... డాక్టర్ షకీలా అభిమతం....
ఆత్మకూరు మున్సిపాలిటీ లోని ప్రజలంతా ఆశీర్వదించి ఓట్లు వేసి తనకు విజయం చేకూర్చారని,తాను చేస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందిస్తానని, ప్రజాసేవలు ప్రారంభిస్తానని, అభివృద్ధి ప్రధాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అండతో ఆత్మకూరు అభివృద్ధి సాధిస్తానని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుండి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పేర్కొన్నారు. ఆమె సోమవారం చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.ఈ సందర్బంగా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మాట్లాడుతూ తమ కుటుంబం అనాదిగా ప్రజలకు సేవలు అందిస్తుందని, వైద్య సేవలతో పాటు అనేక ప్రజాసేవలను కూడా అందించారని, తలవని తలంపుగా రాష్ట్రమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆహ్వానంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా టిడిపి తరఫున పోటీ చేశానని , అందరి ఆధరాభిమానాలతో ఘన విజయం సాధించానని,ఇటు వైద్య సేవలతోపాటు అటు ప్రజలకు ప్రభుత్వ పరంగా సేవలు అందించగలనన్న విశ్వాసంతో లక్ష్యంతో తాను రాజకీయ రంగ ప్రవేశం చేశానన్నారు. రెండింటికీ న్యాయం చేసేలా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని, యధావిధిగా వైద్య సేవలు అందించడంతోపాటు మంత్రి ఆనం సహకారంతో ఆత్మకూరును అభివృద్ధిపరిచేందుకు తన వంతు ప్రత్యేకంగా కృషి చేస్తానని, మున్సిపల్ పరిధిలో ఇప్పటికే తమ దృష్టికి వచ్చిన,రానున్న రోజుల్లో తమ దృష్టికి తెచ్చే సమస్యలను తాను నేరుగా పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఓటర్లు తనను ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చినందుకు తనవంతు సేవలాందించి రుణం తీర్చుకుంటానని డాక్టర్ షకీలా పేర్కొన్నారు.