గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం
1, 2 వార్డుల్లో విస్తృత పర్యటన.. భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి
ప్రచారంలో కదం తొక్కిన మహిళలు, ముఖ్య నాయకులు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి రమేష్ శెట్టి దూకుడు పెంచారు. ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం స్థానిక 1, 2 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. గడపగడపకూ తిరుగుతూ ప్రతి ఓటరును ఆప్యాయంగా పలకరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా రమేష్ శెట్టి మాట్లాడుతూ.. గ్రామంతో పాటు 1, 2 వార్డుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యం:
రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారానికి స్థానిక మహిళల నుంచి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఆయన వెంట నడుస్తూ ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించడంతో ప్రచారంలో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు బొమ్మన దశరథ రామ్ రెడ్డి, ఆయన తనయులు బొమ్మన శ్రీధర్, బొమ్మన శ్రీకర్‌లతో పాటు సురేంద్ర, డాక్టర్ రామ్ ప్రసాద్, వార్డు నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని రమేష్ శెట్టికి మద్దతుగా నిలిచారు.