చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు
చీపురుపల్లి మేజర్ న్యూస్:
చీపురుపల్లి మండలంలో 19 పంచాయతీ ల సర్పంచ్ పదవులకు రెండో రోజు నామినేషన్ల స్వీకరణలో 52 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే వార్డు సభ్యులకు గాను 305 నామినేషన్లు వచ్చాయి. రెండురోజులకుగాను సర్పంచ్ పదవికి 92 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకు 397 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు స్వీకరణకు గడువు సోమవారంతో ముగియనుంది. చీపురుపల్లిలో సర్పంచ్ పదవికి ఇప్పటివరకు ఆరు నామినేషన్లు వచ్చాయి. చీపురుపల్లి మండలంలో 19 పంచాయతీల సర్పంచ్ పదవికి తొలిరోజు 23 నామినేషన్లు వచ్చాయి. రెండోరోజుతో కలిపి చీపురుపల్లి మేజర్ పంచాయతీ లో 6, అలజంగి 2, చిన్ననడిపల్లి కి 4, దేవరపోదిలంలో 3, గొల్లలపాలెంలో మూడు, గొల్లలములగాం 5, ఇటకర్లపల్లి 3, కరకాం 4, కర్లం మూడు, మెట్టపల్లి 4, నిమ్మలవలస 5, పీకే పాలవలస 5, పర్ల 4, పత్తికాయవలస 4, పెదనడిపల్లి 2, పేరిపి 4, రామలింగాపురం పంచాయతీకి 5, పుర్రేయవలస 4, రావివలస 5 మొత్తం రెండురోజుల్లో ఆయా గ్రామాల సర్పంచ్ పదవికి 75 నామినేషన్లు వచ్చాయి. వార్డు సభ్యులకు గాను మండలంలో అన్ని పంచాయతీలకు మొదటి రోజు 92 రాగా రెండోరోజు 305 నామినేషన్లు వచ్చాయి.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా