న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో
న్యాల్కల్ ;చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు, భవిష్యత్తు తరాలను అంగవైకల్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం న్యాల్కల్ మండలవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాల ద్వారా ఐదేళ్లలోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు తీసుకువచ్చి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.పోలియో అనేది వైరస్ ద్వారా వ్యాపించే అంటువ్యాధి. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి శాశ్వత పక్షవాతం కలిగించే అవకాశం ఉంది. అయితే పోలియో వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. అందుకే ప్రతి చిన్నారికి నిర్ణీత కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు అందించడం అత్యంత కీలకం.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలందించగా, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రజలను చైతన్యపరిచి కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. పోలియో కేంద్రాలకు రాలేని చిన్నారులను గుర్తించి ఆరోగ్య శాఖ నిర్దేశించిన తదుపరి ఇంటింటి పర్యటనలో కూడా చుక్కలు అందేలా చూడటం ముఖ్యమని సూచించారు.పల్స్ పోలియో అనేది ఒక్కరోజు కార్యక్రమంతో ముగిసే బాధ్యత కాదు. ప్రతి చిన్నారికి టీకా రక్షణ అందేలా చూడటం, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించడం, ఆరోగ్య శాఖ సూచనలను పాటించడం ద్వారా మాత్రమే పోలియో రహిత సమాజ లక్ష్యాన్ని నిలబెట్టుకోగలం. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అనే సంకల్పంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించారు వైద్య అధికారులు తెలిపారు.