ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి
రాయికోడ్; మండల కేంద్రమైన రాయికోడ్ లోని ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల ఆదివారం నాడు పంపిణీ చేయడం జరిగింది.అని వార్డెన్ వంశీకృష్ణ తెలిపారు వసతి గృహంలో నివసిస్తున్న విద్యార్థుల పట్ల ప్రతి విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి సరియైన మూలిక సదుపాయాలు కల్పిస్తూ , ప్రతిరోజు వాడుకోవడానికి దుప్పట్లు పరుపులతోపాటు , చలికాలం దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్యం పాడుకాకుండా ఉండాలని ఆలోచించి వసతి గృహంలో నివసించే ప్రతి విద్యార్థికి ఉలెన్ దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తూ వారికి కావలసిన సామాగ్రి అందజేస్తూ వారు అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీనిపట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు