BREAKING
కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ. జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి వైద్యఅధికరి డాక్టర్ అర్చన ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం

గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం

Select Suryaa Now
గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం

నార్కల్;గణేష్‌పూర్ గ్రామంలో తరచూ అక్రమ తవ్వకాలు జరుపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై పోలీసులు ఎట్టకేలకు కొరడా ఝుళిపించారు.నిమ్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై మొత్తం 15 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది.జహీరాబాద్ డీఎస్పీ గారు మరియు జహీరాబాద్ రూరల్ సర్కిల్ సిఐ గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ మరియు సిబ్బంది గణేష్‌పూర్ గని ప్రదేశంలో ఆకస్మికంగా రైడ్ నిర్వహించారు.ఈ రైడ్‌లో పోలీసులు 9 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి, అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 2 స్టోన్ కటింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయాన్ని సిఐ జహీరాబాద్ రూరల్ సర్కిల్   తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ - "గణేష్‌పూర్ గ్రామంలో ఎవరైనా అక్రమంగా, చట్టవ్యతిరేకంగా తవ్వకాలు జరిపినా, గని ప్రదేశంలో అక్రమ కార్యకలాపాలు చేసినా చర్యలు తప్పవు. చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తాం. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎవరినీ వదిలిపెట్టం" అని గట్టిగా హెచ్చరించారు.పోలీసుల ఈ భారీ దాడితో గణేష్‌పూర్ గ్రామంలో అక్రమ తవ్వకాలకు పాల్పడే వారిలో తీవ్ర భయం మొదలైంది. ఇన్ని రోజులుగా భయంతో బతుకుతున్న గ్రామ ప్రజలు పోలీసుల చర్యను స్వాగతిస్తున్నారు."ఇలా రైడ్ చేసి అరెస్ట్ చేస్తేనే గ్రామంలో ప్రశాంతత వస్తుంది. పోలీసులకు మా ధన్యవాదాలు. ఇకపై ఎవరూ అక్రమ తవ్వకాలు చేయకుండా చూడాలి" అని గ్రామస్తులు అన్నారు.గ్రామంలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతామని, అక్రమ కార్యకలాపాలపై ఇలాంటి దాడులు కొనసాగుతాయని సిఐ గారు స్పష్టం చేశారు.