BREAKING
వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు బచ్చు ప్రభాకర్ నూతన గృహ భూమి పూజ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి. ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు.విజేతలకు బహుమతులు ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు మండలంలోని ఆరు గ్రామాల సర్పంచులు కొండేపి మండలం ముప్పారం గ్రామం సర్పంచ్ ఏకగ్రీవం మార్కాపురం నియోజవర్గంలో రెండవ రోజు ముగిసిన పంచాయతీ నామినేషన్ ప్రక్రియ. జగన్ వైఖరిపై కాంగ్రెస్ నేత షేక్ సైదా తీవ్ర విమర్శలు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ న్యాల్కల్ మండల వ్యాప్తంగా విజయవంతంగా పల్స్ పోలియో నన్నూరులో రూపవాణి విస్తృత ప్రచారం వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా కార్మిక రంగానికి ఉరితాళ్లుగా నూతన చట్టాలు! చీపురుపల్లి మండలంలో సర్పంచ్ లకు 52, వార్డులకు 305 నామినేషన్లు గణేష్‌పూర్‌లో పోలీసుల భారీ దాడి - అక్రమ తవ్వకాలపై 15 మందిపై కేసు, 9 మంది అరెస్ట్, 2 స్టోన్ కటింగ్ మిషన్లు స్వాధీనం

వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా

Select Suryaa Now
వనంపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం పశుసంపద పరిరక్షణతో రైతులకు ఆర్థిక భరోసా

ఝ‌రాసంగం; ఝరాసంగం మండలంలోని వనంపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించారు.వైద్య అధికారులు మాట్లాడుతూ పశువులకు సకాలంలో టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు అందించడం, పౌష్టికాహారం, స్వచ్ఛమైన నీరు అందించడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పశువులకు వచ్చే వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించాలని సూచించారు.పశుగ్రాసం కొరత నివారణకు వీబీ–జీ రామ్ జీ పథకం ద్వారా ప్రభుత్వ నిబంధనలు, అర్హతల ప్రకారం పశుగ్రాస సాగు, పచ్చిక బయళ్ల అభివృద్ధి, పశువుల కొట్టాలు, నీటి తొట్ల నిర్మాణం వంటి పనులకు అవకాశం ఉందని వివరించారు. వీటి ద్వారా పశుపోషకులకు మేలు జరగడంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందని తెలిపారు.అదేవిధంగా స్మార్ట్ రేషన్ కార్డుల ప్రాధాన్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రైతులు, పశుపోషకులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లన్న, కాంగ్రెస్ యువ నాయకులు నవీన్, గ్రామ పెద్దలు, యువకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.