అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి. *ఈసారి నన్ను గెలిపించండి*
కుందుర్పి సూర్య న్యూస్:
అన్నా కత్తెరగుర్తు కొట్టేసి నన్ను సర్పంచ్ గా గెలిపించండి. మీకు అభివృద్ధిలో ఐదు సంవత్సరాలు అండగా ఉంటానంటూ అంటూ కుందుర్పి గ్రామసర్పంచ్ అభ్యర్థి గార్మెంట్ గోపాల్ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. గతఐదు సంవత్సరాల క్రితం తమ కుటుంబం సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయింది. ఈఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిలో మీకు అండగా నిలుస్తానంటూ గోపాల్ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన గోపాల్ కు సానుభూతి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈయనతో పాటు అనేకమంది ప్రజలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
*టి రాజు సూర్యదినపత్రిక రిపోర్టర్ కుందుర్పి*