రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు
పలమనేరు మేజర్ న్యూస్ రామసముద్రంలో ఈరోజు నిర్వహించిన జిల్లా స్థాయి త్రోబాల్ పోటీల్లో సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు చిత్తూరు జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో బాలికల విభాగంలో జుబియా, సనా, లక్ష్మీప్రియ ఎంపిక కాగా, బాలుర విభాగంలో శశి జిల్లా జట్టులో స్థానం సంపాదించారు.ఎంపికైన విద్యార్థులు ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో చూపిన ప్రతిభ అభినందనీయమని, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల కరస్పాండెంట్ కిషోర్ కుమార్ ఎంపికైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే వారికి శిక్షణ అందించిన కళాశాల పీడీలు కిరణ్, ధరణి, హరీష్‌లను ప్రశంసించారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్