BREAKING
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం సర్పంచ్ రాధిక రామగౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా

*పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి*

Select Suryaa Now
*పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ పట్టణంలోని హెచ్‌ఆర్ ప్యాలెస్ సమీపంలో నిర్వహించిన మొబైల్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో ఆదివారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించడం ద్వారా చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఐదేళ్లలోపు చిన్నారులు ఎవరూ పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ చౌహన్, పురుషురామ్, సతీష్ సెట్, మాణిక్ ప్రభు సెట్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు