*సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాప్రయోజన కార్యక్రమాలకు ఆకర్షితులై నారాయణఖేడ్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు మచ్కూరి అంజయ్య తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు నారాయణఖేడ్‌కు చెందిన మాడిగారి నర్సింలు, కృష్ణ, రవి తదితరులు సుమారు 30 కుటుంబాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మూడ రామ కృష్ణ మాజీ ఎంపీటీసీ, పండరి రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు సుబుర్, రుక్మిణి గోపాల్ రెడ్డి, మహేష్ చౌహన్, నగేష్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, శాతం దత్తు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.