సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు
పటాన్‌చెరు;దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ విక్రమ్ గౌడ్, పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మారి నుంచి రక్షణ కల్పించవచ్చని తెలిపారు.పోలియో రహిత దేశంగా భారత్‌ను కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోరెమియా, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.