BREAKING
ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు చలి నుంచి రక్షణ కోసం ఉలెన్ దుప్పట్ల పంపిణి స్పెషల్ లోక్ అదాలత్ నందు 11 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడమైనది ముత్తుకూరు సర్పంచ్ గా చిట్టి నామినేషన్ దాఖలు బోరేగావ్ గ్రామములో సర్పంచ్ నాగేందర్ పాటిల్ చిన్నారికి పోలియో చుక్క వేస్తున్న దృశ్యం చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ నల్లంపల్లి గ్రామంలో విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం గడపగడపకూ రమేష్ శెట్టి ఎన్నికల ప్రచారం సర్పంచ్ విక్రమ్ గౌడ్,చైర్మన్ శివానందం ఆధ్వర్యంలో పోలియో చుక్కలు చిన్నారుల ఆరోగ్య భద్రతకు పోలియో చుక్కలు ఎంతో కీలకం సర్పంచ్ రాధిక రామగౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా

*పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి*

Select Suryaa Now
*పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్ కాలనీలో ఆదివారం లయన్స్ క్లబ్ నారాయణఖేడ్ వారి సహకారంతో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలియో వ్యాధి చిన్నారుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యాధి అని, ఈ వ్యాధి బారిన పడకుండా చిన్నారులకు ముందస్తు రక్షణ కల్పించడంలో పోలియో చుక్కలు ఎంతో కీలకమని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకూడదని అన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు రుక్మిణి గోపాల్ రెడ్డి సుబుర్ మాజీ ఎంపిటిసి పండరి రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.