*కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్*
కోహెడ;విజయ డైరీ ఆధ్వర్యంలో, తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి సహకారంతో కోహెడ గ్రామంలోని పాడి రైతులకు పాడి పశువుల కొనుగోలు నిమిత్తం రుణాలు మంజూరు చేయడం జరిగింది. రుణాలు మంజూరైన రైతులు రాగుల లక్ష్మి,అజ్మీర చంద్రకళ,మోతుకుల మాధవి,మాలోతు స్వాతి,జాలిగం శంకర్, మోతుకుల శంకర్, అజ్మీర భజన్, నెళ్లి వెంకటయ్య, అజ్మీర లక్ష్మణ్ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోహెడ విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంకు కోహెడ ఫీల్డ్ ఆఫీసర్ గుగులోతు మోహన్ గారు మాట్లాడుతూ పాడి రైతులు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని పాడి పశువులను కొనుగోలు చేయాలని, తద్వారా తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అలాగే కొనుగోలు చేసిన పశువుల ద్వారా లభించే నాణ్యమైన, స్వచ్ఛమైన పాలను కోహెడలోని విజయ డైరీకి సరఫరా చేయాలని కోరారు. అంతేకాకుండా, కోహెడ విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులకు పశువుల బీమా సౌకర్యం, పశువులకు అవసరమైన దాణా, కాల్షియం, మినరల్ మిక్స్చర్, జొన్నలు మరియు పాడి పశువుల కొనుగోలుకు రుణాల రూపంలో అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా, కొత్తగా పాడి పశువులను కొనుగోలు చేసి డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలనే ఆసక్తి ఉన్న రైతులకు కూడా విజయ డైరీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు.