BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి

Select Suryaa Now
ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి

-  కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపించాలని దార పనేని ఎన్నికల ప్రచారం 

పామూరు, మేజర్ న్యూస్ : మండలం 

తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వం సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఉగ్ర ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి తరఫున సర్పంచ్ బరిలో నిలిచిన మానం రాజేశ్వరికి ప్రజలు అండగా నిలిచి విజయాన్ని అందించాలని కోరారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా దారపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అదే అభివృద్ధి దృక్పథంతో తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతీలోనూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రాజేశ్వరికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ నెల 26న జరిగే ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి రాజేశ్వరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని చంద్రశేఖర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  సర్పంచ్ అభ్యర్థి మానం రాజేశ్వరి,మానం మల్లికార్జున, వార్డు మెంబర్లు చెనికల భాగ్యమ్మ, అద్దంకి మాల్యాద్రి,చుండూరు పోలయ్య,దారనేని అన్నపూర్ణ,తాతాపూడి ఏసుబు,తాళ్ళురి జయరావు,మన్నం రమణమ్మ,ఈర్ల ఉమ,మానం నాగేంద్ర యాదవ్,చెనికల మల్లికార్జున, చెనికల మాలకొండయ్య,నాగరాజు,దేవరకొండ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.