BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ?

Select Suryaa Now
అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ?

హుస్నాబాద్;ఉదయం పూట భోజనశాలలు.. రాత్రి అయితే మినీ వైన్స్, పర్మిట్ రూమ్‌లుగా మారుతున్నాయన్న ఆరోపణలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే కొన్ని ప్రాంతాల్లో మద్యం సేవించేందుకు ప్రత్యేకంగా సిట్టింగులు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పేరుకు భోజనశాలలు, రెస్టారెంట్లు.. కానీ రాత్రి వేళల్లో మాత్రం మద్యం సేవించే వారికి వేదికలుగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం విక్రయాలు, సేవనానికి సంబంధించిన నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పర్మిట్ రూమ్‌కు అనుమతి లేకపోయినా మద్యం సేవించేందుకు సిట్టింగ్ సౌకర్యాలు కల్పిస్తే దానిపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక నిబంధనల్లో వ్యాపార సమయాల ఉల్లంఘన, అనుమతి లేని కార్యకలాపాలపై జరిమానాలు, ఇతర చర్యలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?

అధికారులకు సమాచారం లేదా?

తెలిసినా పట్టించుకోవడం లేదా?

తనిఖీల పేరుతో కేవలం కాగితాలకే పరిమితమవుతున్నారా?

ఎక్సైజ్ అధికారుల నిఘా ఏమైంది?:

రాత్రి వేళల్లో భోజనశాలల వద్ద సిట్టింగులు జరుగుతున్నాయన్న ఆరోపణలు నిజమైతే వాటిపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా? నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు జరుగుతున్నాయా? అన్నది స్పష్టం చేయాలని ప్రజలలో డిమాండ్ వినిపిస్తుంది