ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం?
హుస్నాబాద్;ఎండనక, వాననక రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన అన్నదాతకు చివరకు మిగిలేది అప్పులేనా? ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న పరిణామాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు సకాలంలో అందుబాటులోకి రాకపోవడం, ప్రారంభమైన కేంద్రాల్లోనూ కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కాకపోవడం రైతులకు శాపంగా మారుతోంది.పంట చేతికొచ్చిన సమయంలో రైతులకు పెట్టుబడి అవసరాలు, అప్పుల చెల్లింపులు, కుటుంబ ఖర్చులు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితిని కొంతమంది దళారులు అవకాశంగా మలుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించే అవకాశం లేక, తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కొంతమంది రైస్ మిల్లర్లు సైతం దళారుల అవతారమెత్తి తమకు అనుకూలమైన ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ధర నిర్ణయించే పరిస్థితి ఏర్పడితే అన్నదాతకు న్యాయం జరిగేదెక్కడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండ చూడవలసిన సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టవలసిన అవసరం ఉంది కొనుగోలు కేంద్రాల నిర్వహణ తూకాల్లో పారదర్శకత తెమ శాతం పేరుతో కోతలు విధించకుండా చూడడం మద్దతు ధర అమలు పర్యవేక్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కురబడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి? ప్రభుత్వ ఆదేశాలు సమావేశాలకే పరిమితం అవుతున్నాయా? ఇక రైతులకు నిజంగా మేలు జరుగుతుందా? అన్నది అధికారుల పనితీరును బట్టి స్పష్టమవుతుంది.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి దళారుల జోక్యాన్ని అరికట్టి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు చేపట్టాలి రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పంట పండించేది రైతు లాభపడేది దళారుల? కష్టపడేది అన్నదాత దోచుకునేది మధ్యవర్తుల? అనే ప్రశ్నలు రైతాంగం నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి రైతులకు అండగా నిలుస్తారా? లేక దళారుల దోపిడీకి మౌనసాక్షులుగా మిగిలిపోతారా వేచి చూడాల్సిందే.