గంగవరం మండల యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా ధ్యేయం- సర్పంచ్ అభ్యర్థి సతీష్
పలమనేరు మేజర్ న్యూస్ గంగవరం మండల ప్రజలకు యువతకు ఉద్యోగాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశమని గంగవరం సర్పంచ్ అభ్యర్థి సతీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెంగళూరు లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. తాను గంగవరం మండల ప్రజలకు యువతకు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంతో పని చేయాలనుకున్నాను. యువతకు ఉచితంగా లాప్టాప్ లు అందిస్తానన్నారు. యువతీ యువకులకు స్కిల్ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ స్కిల్ అవేర్నెస్ పై అవగాహన కల్పించి వారికి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు నగరాలలో ఉద్యోగాలు చేసుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను పుట్టిన ఊరు కి ఎంతో సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ప్రజలకు యువతకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, స్మశాన సమస్య, ఇలాంటివి ఎన్నో సమస్యలతో గంగవరం మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ప్రజలకు తాను సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. తన గుర్తు బుట్ట గుర్తు నాలుగో నెంబర్ కు ఓటు వేయాలని గంగవరం మండల ప్రజలను అభ్యర్థించారు. తాను గెలుపొందిన వెంటనే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను అన్నారు. తాను ఏ పార్టీకి సంబంధం లేదని తెలిపారు. తనపై నమ్మకంతో గంగవరం మండల ప్రజలు బుట్ట గుర్తు నాలుగో నెంబర్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని ఓటర్లను ఇండిపెండెంట్ అభ్యర్థి సతీష్ కోరారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్