BREAKING
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి పడమటి అనంత్ రెడ్డి సర్పంచ్ *సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.* *పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి* *పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి* పూజలు నిర్వహించిన రాగాల శివకృష్ణ కుటుంబ సభ్యులు. వైద్య సేవలు కొనసాగిస్తా --ప్రజా సేవలు ప్రారంభిస్తా అన్నా కత్తెర గుర్తుకు కోటెయ్యండి.  *ఈసారి నన్ను  గెలిపించండి*     నేడు మేయర్ గా రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం డిప్యూటీ మేయర్ ఎన్నిక *శ్రీరాములపల్లిలో వైభవంగా ఆంజనేయస్వామి ఆలయ గడప ప్రతిష్ఠాపన మహోత్సవం* "బొమ్మిరెడ్డి "కుటుంబీకుల సేవల వారసత్వం ఆరంభం *కోహెడ అయ్యప్ప స్వామి ఆలయానికి 187 గ్రాముల వెండి కిరీటాన్ని అందజేసిన బండారి శ్రీధర్–రాజశ్రీ దంపతులు* రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు సాయి కిషోర్ కళాశాల విద్యార్థులు ఎంపిక ముగ్గురు విద్యార్థినులు, ఒక విద్యార్థికి జిల్లా జట్టులో చోటు *కోహెడ విజయ డైరీ పాడి రైతులకు రుణాలు మంజూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సహకారం విజయ డైరీ అధ్యక్షులు జాలిగం శంకర్* కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు

ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి

Select Suryaa Now
ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ :అనంతపురం జిల్లా ఆర్టిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ ప్రైమ్ స్కూల్ విద్యార్థి పి. భరత్ అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించాడు. అండర్ - 10 కేటగిరీలో జరిగిన లాంగ్ జంప్ మరియు 100 మీటర్ల పరుగు పోటీలలో భరత్ ప్రథమ స్థానంలో నిలిచాడు. భరత్ ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్నాడు.

ఈ సందర్భంగా జోనల్ ఇన్చార్జి ఎం. శివకుమార్  ,విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదా రెడ్డి డైరెక్టర్లు ఎ .సంతోష్ రెడ్డి , ఎ. మధుకర్ రెడ్డి , పాఠశాల ప్రిన్సిపాల్ వై. లక్ష్మీదేవి , డీజీఎం ఎం. రమణ , ఏజీఎం ఎస్. రవిచంద్ర  విద్యార్థి భరత్ ను ఘనంగా అభినందించారు.

ఇంతటి విజయాన్ని సాధించిన భరత్ కు వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

భరత్ కు శిక్షణ ఇచ్చిన కోచ్ లకు, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్