BREAKING
కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య మర్కుక్ మండలంలోని ఫామ్ హౌస్‌లపై పోలీసుల ముమ్మర తనిఖీలు పిఠాపురం తరహాలో రేణిగుంటను అభివృద్ధి చేస్తాం..….... జనసేన పార్టీ సర్పంచ్ అభ్యర్థి నగరం జయలలిత ఆర్డిటి స్పోర్ట్స్ మీట్ లో ఎస్ ఆర్ విద్యార్థికి ప్రథమ బహుమతి ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ వైఫల్యం *నూతన కిరాణా షాప్ ను ప్రారంభించిన ఆరెపల్లి గ్రామ సర్పంచ్ చిట్యాల బాపురాజు* అనుమతులు లేకుండానే మద్యం సేవనానికి ఏర్పాట్లు.. ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ? *ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచక వాదాన్ని అంతం చేద్దాం * ఎమ్మెల్యే ఉగ్ర నాయకత్వమే అభివృద్ధికి దిక్సూచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గంగవరం మండల యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా ధ్యేయం- సర్పంచ్ అభ్యర్థి సతీష్ *నూతన వధూవరులను ఆశీర్వదించిన బస్వాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు* సర్పంచ్‌గా విజయం సాధించాలని మల్లేశ్వరి పూజలు *ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా* ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం?

38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం!

Select Suryaa Now
38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం!

​కావలి, మేజర్ న్యూస్ :  కావలి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో వార్డులో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి, హారతులతో ఆయనకు బ్రహ్మరథం పట్టడం ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
​ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి వీధిలో, ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించిన ఇస్కా విక్రమ్ రెడ్డి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని కొనియాడారు. కావలి పట్టణ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ 38వ వార్డును మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలా ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.  
​వార్డులో నెలకొన్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న విక్రమ్ రెడ్డి, తాను గెలిచిన వెంటనే వాటి పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన మహిళలు, టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని, అభ్యర్థి విజయానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.