BREAKING
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం

Select Suryaa Now
24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం

​కావలి, మేజర్ న్యూస్ :  కావలి మున్సిపాలిటీ 24వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు వార్డు పరిధిలోని రూపాయి మిద్ది, శాంతినగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా కాలనీల్లో పర్యటించిన ఆయన, ఓటర్లను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
​ప్రచార కార్యక్రమంలో పార్ధు మాట్లాడుతూ, యువకుడిగా 24వ వార్డు అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సహకారం, ఆశీస్సులతో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ వార్డు ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూపాయి మిద్ది, శాంతినగర్ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
​మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గురించి పార్ధు ప్రస్తావిస్తూ, స్వర్గీయ కలికి యానాదిరెడ్డి శిష్యుడిగా, సౌమ్యుడిగా ఆయనకు పట్టణంలోని 44 వార్డుల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయని తెలిపారు. ఆయన నాయకత్వంలో కావలి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
​రానున్న ఎన్నికల్లో రూపాయి మిద్ది, శాంతినగర్ ఓటర్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని, 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పార్ధు విజ్ఞప్తి చేశారు. వార్డులోని ప్రతి కాలనీ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, మహిళా విభాగం సభ్యులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.