డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆశీస్సులతో పోటీ చేసి ఘన విజయం సాధించిన స్థానిక బి ఎస్ ఆర్ హాస్పెటల్ నిర్వాహకురాలు డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా సోమవారం ప్రమాణ స్వీకారం, పదవీ బాధ్యతల స్వీకారం చేయనున్నారు.ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు అభిమానులకు
డాక్టర్ షకీలా, ఆమె తనయుడు యువనేత, బి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి లు ఆత్మీయ నమస్కారాలతో ఆహ్వానించారు.
ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం (23వతేదీ ) ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం లో జరుగుతునన్నారు.
ఆత్మకూరు పట్టణ ప్రజల అపూర్వ ఆశీస్సులతో ఎన్నికైన మునిసిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ బొమ్మిరెడ్డి షకీల,మరియు ఎన్నికైన గౌరవ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుందన్నారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా మనవి చేశారు.
ఉదయం 9:20 గంటలలోగా బిఎస్ఆర్ సెంటర్ వద్ద సమావేశం జరుగుతుందని,ప్రజలు, నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులందరూ బిఎస్ఆర్ సెంటర్ వద్ద సమావేశమవ్వగలరని వారు కోరారు.
ఉదయం 9:30 గంటలకు
డాక్టర్ బిఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పణ జరుగుతుందని,
ఉదయం 10:00 గంటలకు అక్కడనుండి ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు.
బిఎస్ఆర్ సెంటర్ నుంచి ఆత్మకూరు మునిసిపాలిటీ వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలతో ర్యాలీ జరుగుతుందన్నారు.
ఉదయం 11:00 గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందన్నారు.
ఆత్మకూరు మునిసిపాలిటీలో మునిసిపల్ చైర్‌పర్సన్ మరియు ఎన్నికైన గౌరవ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుందని,
ఎన్నికైన కౌన్సిలర్లు తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులైన అనంతరం, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించబడుతుందని వారు పేర్కొన్నారు.
ఆత్మకూరు ప్రజలందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన పాలకవర్గాన్ని ఆశీర్వదించి, ఈ చారిత్రాత్మక వేడుకను విజయవంతం చేయవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని
డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా, బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి సాదర ఆహ్వానం పలికారు.