మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..!
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్ : దట్టంగా కమ్ముకున్న పొగ మం చు దృశ్యాలు తోటపల్లిగూడూరు మండల ప్రజలకు ఆహ్లాదాన్ని, వి నోదాన్ని కలిగించాయి. ఆదివా రం ఈ అపురూప దృశ్యం ప్రజల కు కనువిందు చేసింది. ప్రజలను అబ్బురుపరిచిన అంశం ఏమి టంటే ప్రతి సంవత్సరం భోగి ప ర్వదినం నాడు దట్టంగా పొగ మంచు అలుముకుంటుంది. అ యితే భోగి పర్వదినానికి రెండు నెలల ముందే ఈ దృశ్యం కనిపిం చడం. చలికాలం ఇలా మొదలయ్యిందో లేదో పొగ మంచు దట్టంగా కమ్మేస్తోంది. పొ గ మంచు రమణీయ దృశ్యాలు ఓ వైపు ప్రజలను ఆహ్లాదపరిచాయి. మరోవైపు వినోదాన్ని కలిగించాయి. దట్టంగా అలుముకున్న పొగ మంచి దృశ్యాలు జమ్ము కశ్మీర్‌ను తలపించాయి. కమ్ముకున్న దట్టమైన పొగమంచుతో ఊరేదో..రోడ్డేదో.. చెట్టేదో తెలియకుండా పోయింది. మునుపెన్నడూ ఎన్నడూ లేని విధంగాపొగ మంచు దట్టంగా అలముకుంది. ఉదయం 8 గంటల సమయంలో కూడా సూర్యుడు కనబడలేదు, పొగ మంచు వీడకపోవడంతో వాహనదారులు, రైతులు ఇతర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రహదారులపై కూడా దట్టంగా మంచు అలుముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా ఏముందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో వాహనాలు చోదకులు పట్టపగలు లెట్లు వేసుకొని వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా దట్టమైన మేఘంలా భారీగా కమ్మిన పొగ మంచు ఓ వైపు ఆహ్లాదాన్ని కలిగించినప్పటికి, మరోవైపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయన్ని కలిగించింది.