BREAKING
రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం

సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు..

Select Suryaa Now
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు..

సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.

* రైతుల ముసుగులో ప్రైవేట్ సీడ్ కంపెనీల పావులు.

* తాలిపేరు నీటి తరలింపుపై ‘సూర్య’ కథనాలతో కదలిక.. మోటార్ల తొలగింపు.

* డీఈని కలిసేందుకు నిర్వాహకుల పన్నాగం..రాత్రి సమావేశాలతో మంతనాలు.

* స్థానిక ఆదివాసులకు ప్రయోజనం శూన్యమని గ్రామస్థుల ఆగ్రహం.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

ఏజెన్సీ ప్రాంతంలో ప్రైవేట్ సీడ్ వరి సాగు కోసం సీడ్ కంపెనీల నిర్వాహకులు సరికొత్త ఎత్తుగడలకు తెరలేపారు.రబీ సీజన్‌లో వరి సాగుకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా,ప్రతి ఏటా మాదిరిగానే లాభాల పంట పండించుకునేందుకు నిర్వాహకులు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.మండల పరిధిలోని పెద్ద నల్లబల్లి,చిన్న నల్లబల్లి గ్రామాల మధ్య శివారులోని తాలిపేరు ప్రధాన కాలువ నుంచి అక్రమంగా నీటిని తోడి సమీప చెరువును నింపేందుకు ఇటీవల ప్రైవేట్ సీడ్ కంపెనీలు ట్రాక్టర్ మోటార్లను ఏర్పాటు చేశాయి.ఈ వ్యవహారంపై ‘సూర్య’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువ గట్టుపై ఉన్న మోటార్లను తొలగించారు.అధికారుల తీరుపై పత్రిక కథనాలపై చిన్న నల్లబల్లి,పెద్ద నల్లబల్లి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు కానీ సీడు నిర్వాహకులు రైతులను అడ్డం పెట్టుకుని ప్రతి ఆటలాగే లాభాలు ఎక్కడ చేజారుతాయని మరో కొత్త ఎత్తుగడుగు తెరలేపారు.

*రైతుల పేరిట కొత్త నాటకం..*

సీడు సాగుకు అడ్డుకట్ట పడటంతో తర్జనభర్జన పడుతున్న సీడ్ నిర్వాహకులు ఇప్పుడు రైతులను ముందుపెట్టి కొత్త డ్రామాకు తెరలేపారు.చెరువులో ఇప్పటికే సరిపడా నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు కింద పంట పొలాలు ఎండుతున్నాయని చివరి తడి అందక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతుల పేరిట వినతిపత్రంసిద్ధం చేశారు.ఇందులో భాగంగా ఇరిగేషన్ డీఈని కలిసి వరి సాగుకు లేదా నీటి తరలింపునకు అనుమతులు తెచ్చుకునేందుకు నిర్వాహకులు పన్నాగం పన్నుతున్నారు.

*రాత్రిపూట చీకటి సమావేశాలు..*

‘సూర్య’ కథనాలకు సవాలుగా సీడ్ కంపెనీ పెద్దల సూచనల మేరకు కొందరు వలస రైతులు రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా చీకటి సమావేశాలు నిర్వహిస్తూ కాలువ నుంచి రాత్రివేళల్లో నీటిని తోడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.పెద్ద నల్లబల్లి చెరువును ప్రైవేట్ సీడ్ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాయని స్థానిక ఆదివాసి రైతులు మండిపడుతున్నారు.ఈ నీటి తరలింపు వల్ల రెండు గ్రామాల ప్రజలకు స్థానిక ఆదివాసీలకు ఎలాంటి ఉపయోగం ఉండదని,కేవలం ప్రైవేట్ వ్యాపారుల జేబులు నింపడానికే ఈ తతంగం నడుస్తోందని వారు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం రబీలో వరి సాగుకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్న వేళ ఇరిగేషన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్.. కల్లూరి సుమన్.