హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్
కౌడిపల్లి;చేనేత కార్మికులకు పింఛన్లు ఇవ్వకపోవడం, ఇతర సమస్యలు నెరవేర్చుకునేందుకు ఈనెల 23న టిఆర్ పీఎస్ (తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించే హలో నేతన్న .. చలో చేనేత భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా పద్మశాలి సంఘం యూత్ అధ్యక్షుడు పూల నవీన్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50ఏండ్లు నిండిన చేనేతలకు చేయూత పథకంలో పింఛన్ ఇస్తానని చెప్పినా ప్రభుత్వం జిల్లాలో పద్మశాలి చేనేతకు ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, తదితరులకు చేయూత పింఛన్లు మంజూరు చేసిందన్నారు. కాగా పద్మశాలి చేనేతలకు పింఛన్లు మాత్రం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అర్హులైన పద్మశాలి చేనేతలకు పింఛన్లు రాకుండా పోయాయి అన్నారు.