కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం
కౌడిపల్లి;మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీ చంద్రం కృష్ణ గౌడ్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి శ్రీ రామారావు గారు, ఉప సర్పంచ్ శ్వేతా మల్లికార్జున గౌడ్ వార్డు సభ్యులు లక్ష్మీ శరత్ మక్బూల్ దేవేందర్ బొంత మా సంగప్ప పంచాయతీ కార్యదర్శి జంగం నగేష్ కుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సంతోష్ రాగుల భూమయ్య వెంకటేశ్వరరావు మల్లేశం రమేష్ గౌడ్ మైనార్టీ నాయకులు అన్వర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.