BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం

Select Suryaa Now
తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం

కొల్చారం;కఠోర శ్రమ, పట్టుదల, లక్ష్యంపై అచంచలమైన నమ్మకం ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చని వరిగుంతం గ్రామానికి చెందిన నీరుడి ప్రశాంత్ నిరూపించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని మారుమూల గ్రామం నుంచి ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా (ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేసి, తాజాగా తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రశాంత్ తన విద్యాభ్యాసాన్ని వరిగుంతం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పదో తరగతి వరకు పూర్తి చేశారు. అనంతరం కొల్చారంలో ఇంటర్మీడియట్ చదివి, సిద్దిపేట లోని ఎస్ ఎం హెచ్ కళాశాలలో డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత న్యాయవిద్యపై ఆసక్తితో ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్.ఎల్.బి పూర్తిచేసి, న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. మార్మూల గ్రామం నుంచి వచ్చి ఉస్మానియా లా కాలేజీలో చదవడం, నేడు ప్రతిష్టాత్మక తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రోత్సహించిన నాకు నా తల్లిదండ్రులు, గురువులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అన్నారు. సామాన్య ప్రజలకు, పేదలకు న్యాయం అందించడం నా ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు.గ్రామీణ నేపథ్యం నుంచి అంచలంచలుగా ఎదిగి హైకోర్టు న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ గ్రామీణ నేపథ్యం నుంచి అంచలంచలుగా ఎదిగి హైకోర్టు న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టిన నీరుడి ప్రశాంత్ విజయంపై వరిగుంతం గ్రామస్తులు, కొల్చారం మండల ప్రజలు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. భవిష్యత్తులో న్యాయవాద రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, పేదలకు న్యాయం అందించే దిశగా ఆయన సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు.