BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

ఆత్మకూరులో కొయ్య వృత్తిదారులచే విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

Select Suryaa Now
ఆత్మకూరులో కొయ్య వృత్తిదారులచే విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మండల కొయ్య వృత్తిదారులు తమ సమస్యల పరిష్కారం, వృత్తిదారుల ఐక్యతే లక్ష్యంగా విరాట్ కార్పెంటర్స్ అసోసియేషన్ పేరిట నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని సోమశిల రోడ్ సెంటర్ ప్రాంతంలో మండలానికి చెందిన కార్పెంటర్లు, చెక్కపని చేసే వారు, అనుబంధ వృత్తిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా పేరుస్వాముల అశోక్, ఉపాధ్యక్షుడిగా షేక్ అల్లా బక్షు, కార్యదర్శిగా షేక్ మీరావలి, జాయింట్ సెక్రటరీగా పేరుస్వాముల వీరాచారి, ట్రెజరర్‌గా వంగిపురపు వినోద్‌ను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఏ. బ్రహ్మయ్య, షేక్ ఇస్మాయిల్ , చేజర్ల. మల్లికార్జునచారి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా కార్పెంటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యాపారులు స్థానికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని బయటి ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తుండటంతో స్థానిక వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబాలను పోషించుకోవడం కూడా కష్టంగా మారుతోందన్నారు. కార్పెంటర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంఘటితంగా కృషి చేస్తామని తెలిపారు. గృహ యజమానులు తమ ఇళ్లకు సంబంధించిన చెక్కపనులు, ఇతర అవసరాల కోసం స్థానిక కార్పెంటర్లకు ప్రాధాన్యతనిచ్చి పని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్పెంటర్లతో పాటు సుమారు 50 మంది వృత్తిదారులు, అనుబంధ పనివారు పాల్గొన్నారు.