BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

నగరం మండలంలో 60 మంది సర్పంచ్, 249 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు

Select Suryaa Now
నగరం మండలంలో 60 మంది సర్పంచ్, 249 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు
నగరం, మేజర్ న్యూస్: సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా రెండవ  రోజైన ఆదివారం మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల్లో 60 మంది సర్పంచ్ పదవికి, 249 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు తెలిపారు.  పమిడిమర్రు పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, 9 మంది వార్డు సభ్యులకు, సజ్జావారిపాలెం పంచాయితీలో ఇద్దరు వార్డు సభ్యులకు, అల్లపర్రు పంచాయతీలో 4 గురు సర్పంచ్ కి, 16 మంది వార్డు సభ్యులకు, ఉల్లిపాలెం పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, 11 మంది వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈదుపల్లి పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, 12 మంది వార్డు సభ్యులకు, మీసాలవారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, ఆరుగురు వార్డు సభ్యులకు, 
తాడివాకవారిపాలెం పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 16 మంది వార్డు సభ్యులకు, చినమట్లపూడి పంచాయతీలో 5 గురు సర్పంచ్ కి, 14 మంది వార్డు సభ్యులకు, పెదమట్లపూడి పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఆరుగురు వార్డు సభ్యులకు, అద్దంకివారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచికి, 11 మంది వార్డు సభ్యులకు, ధూళిపూడి సౌత్ పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, 5 గురు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. వెనిగళ్ళవారిపాలెం పంచాయితీలో ఒకరు సర్పంచ్ కి, ముగ్గురు వార్డు సభ్యులకు, కొలగానివారిపాలెం పంచాయితీలో ఒకరు వార్డు సభ్యులకు, ధూళిపూడి నార్త్ పంచాయితీలో ముగ్గురు సర్పంచికి, 14 మంది వార్డు సభ్యులకు, మంత్రిపాలెం పంచాయతీలో ముగ్గురు సర్పంచ్ కి, ఇద్దరు వార్డు సభ్యులకు, పూడివాడ పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, నలుగురు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. సిరిపూడి పంచాయతీలో నలుగురు సర్పంచ్ కి, 11 మంది వార్డు సభ్యులకు, జిల్లేపల్లి పంచాయతీలో నలుగురు సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులుగా, పెద్దవరం పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, ముగ్గురు వార్డు సభ్యులు, బెల్లంవారిపాలెం పంచాయితీలో ఐదుగురు సర్పంచ్ కి, 20 మంది వార్డు సభ్యులకు, బోరమాదిగపల్లి పంచాయతీలో నలుగురు సర్పంచ్ కి, 20 మంది వార్డు సభ్యులకు, ఏలేటిపాలెం పంచాయితీలో నలుగురు సర్పంచికి 10 మంది వార్డు సభ్యులుగా, న్యూ అంబేద్కర్ నగర్ పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, 8 మంది వార్డు సభ్యులకు, చిరకాలవారిపాలెం పంచాయితీలో 4 గురు సర్పంచ్ కి, 15 మంది వార్డు సభ్యులకు, పెద్దపల్లి పంచాయితీలో  నలుగురు సర్పంచ్ కి, 20 మంది వార్డు సభ్యులు, నగరం పంచాయతీలో ఆరుగురు వార్డు సభ్యులుగా తమ నామినేషన్లు దాఖలు చేశారు.