కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు ఆధ్వర్యంలోఆది వారం స్థానిక టిడిపి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఓవైపు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెడుతూ మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తున్నారని దానిని స్ఫూర్తిగా తీసుకొని నేడు ఆమె జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు ఎంవి శేషయ్య, నాయకులు దొడ్ల కోదండరామిరెడ్డి, ఎరటపల్లి శివకుమార్ రెడ్డి, భువనేశ్వరం మురళి, కౌన్సిలర్లు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.