BREAKING
*ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా* ధాన్యం కొనుగోళ్లలో దళారుల ఇష్టారాజ్యం? రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్ ఢీకొని వ్యక్తి మృతి తెలంగాణ ముదిరాజ్ మహాసభను జయప్రదం చేయండి..! దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబురాలు… 38వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టీడీపీ అభ్యర్థి ఇస్కా విక్రమ్ రెడ్డికి మహిళల బ్రహ్మరథం! ఏలేటిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా ఎలిజబెత్ రాణి నామినేషన్ తిమ్మిరెడ్డిపల్లిలో ఆగిన ఏకగ్రీవ ఆశలు.. ​చిన్న పంచాయతీలో పెద్ద పోటీ సర్పంచ్ పీఠానికి 11 మంది సై సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి*

హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు

Select Suryaa Now
హైదరాబాద్‌లో 26/11 తరహా ఉగ్రదాడుల బెదిరింపు

హైదరాబాద్: నగరంలో 26/11 తరహా ఉగ్రదాడులను పునరావృతం చేస్తామంటూ వచ్చిన ఓ బెదిరింపు ఈ-మెయిల్ కలకలం రేపింది. లష్కరే తోయిబా పేరుతో ఆగంతకులు పంపిన ఈ మెయిల్‌లో, తమ సహచరుడు లతీఫ్ భట్‌తో పాటు ఇతరులను హతమార్చినందుకు ప్రతీకారంగా దాడులకు పాల్పడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కాచిగూడ టూరిస్ట్ ప్లాజాతో పాటు రైల్వే స్టేషన్‌ను పేల్చేస్తామని, ఈ దాడుల్లో కనీసం 300 మందిని చంపడమే తమ లక్ష్యమని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపు సమాచారంతో అప్రమత్తమైన స్పెషల్ బ్రాంచ్ అధికారులు నగర పోలీసులకు తక్షణమే ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు. అయితే, దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. అది కేవలం ఆకతాయిలు పంపిన ఫేక్ మెయిల్‌గా నిర్ధారించారు.