BREAKING
సీడ్ వరి సాగుకు ‘చీకటి’ఎత్తులు.. 24వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి పార్ధు ఇంటింటి ప్రచారం డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారోత్సవం నేడే -- తల్లీ, తనయుల ఆహ్వానం వైభవంగా తులసి దామోదర కళ్యాణం మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

వైసీపీ కి అధికారం బ్రమే...కూటమిదే అధికారం:మజ్జి

Select Suryaa Now
వైసీపీ కి అధికారం బ్రమే...కూటమిదే అధికారం:మజ్జి

చీపురుపల్లి మేజర్ న్యూస్ : 2029 సార్వత్రిక ఎన్నికల గెలుపు కోసం భ్రమలో ఉన్నాయని, వారిని ఆ భ్రమలోనే ఉన్నిద్దామంటూ విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.  తెలుగుదేశం కూటమి పార్టీలు బలపరిచిన చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు నామినేషన్ కార్యక్రమానికి ఆయన ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కాము నాయుడు వెంట చీపురుపల్లి పట్టణ పరిధిలోని పలు వీధుల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు, కార్యకర్తలు స్థానిక మూడు రోడ్ల కూడలికి చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన్న చిన్న శ్రీను మాట్లాడుతూ 2029 కోసం కలలుగంటున్న ప్రతిపక్ష నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని కచ్చితంగా ముక్తకంఠంతో చెప్పారు. 2029లో తామే అధికారంలోకి వస్తామంటూ  ప్రతిపక్షం కంటున్న కలలను కలలుగానే వదిలేద్దామని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. డిసెంబర్ 2న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో చీపురుపల్లి పట్టణంలోని యువత మహిళలు పెద్దలు భారీ ఎత్తున  పాల్గొని అందరికీ అందుబాటులో కష్టసుఖాల్లో స్థానికంగా అందుబాటులో గల కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి రౌతు కాము నాయుడు కు ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతాయని, ఓట్లు వేసిన తర్వాత ఏదైనా సమస్యపై వారి దగ్గరికి వెళితే మనం అధికారంలో లేము అధికారం వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరించుకుందామంటూ కబుర్లు చెప్పడం తప్ప వారు చేసేది ఏమీ ఉండదని  చిన్న శ్రీను గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, నియోజకవర్గంలో కళా వెంకటరావు శాసనసభ్యత్వం తో పాటు, మండల పరిషత్, కూడా కూటమి ప్రభుత్వం కైవసం కావడంతో, చీపురుపల్లి మేజర్ పంచాయతీ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి  కాము నాయుడు గెలుస్తారని జోస్యం చెప్పారు. అధికారంలో ఉన్న నేపథ్యంలో చీపురుపల్లి నీ మోడల్ సిటీగా తయారు చేయడానికి అవసరమైన నిధులను రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, శాసనసభ్యుల కోట నుంచి, ఇతర పథకాల ద్వారా లక్షలాది రూపాయలు అభివృద్ధి నిధులను తీసుకురాగలమని చెప్పారు. క్రమశిక్షణకు, అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన చీపురుపల్లిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. చీపురుపల్లి ప్రాంత ప్రజల ఆలోచన విధానం మారిందనడానికి నిదర్శనంగా ఈ నెల ఐదున జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో చీపురుపల్లి పట్టణ పరిధిలోని ఆరు ఎంపీటీసీ లతో పాటు జడ్పిటిసిని కూడా తెలుగుదేశం కూటమి  కైవసం చేసుకోవడం నిదర్శనమన్నారు. అదే తరహాలో చీపురుపల్లి పట్టణ పరిధిలోని 20  వార్డు మెంబర్ల విజయాన్ని కూడా అత్యధిక మెజార్టీతో సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. పదవులు ముఖ్యం కాకుండా అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బాధ్యతాయుతంగా కాము నాయుడు పని చేస్తారని గెలిపించాలని కోరారు.  అనంతరం ర్యాలీగా వెళ్లి కాము నాయుడు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి రామానుజాచార్యులకి అందజేశారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, ఎంపీటీసీ గవిడి నాగరాజు,  పట్టణ పరిధిలోని ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా పోటీలో నిలిచిన అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు   పాల్గొన్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా