పరిటాల శ్రీరామ్‌కు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలు
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన అనంతపురం జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ పరిటాల శ్రీరామ్‌ను సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
జిల్లా పరిషత్ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ఎన్నిక కావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. క్రీడారంగంతో అనుబంధం కలిగిన నాయకుడిగా ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో క్రీడారంగ అభివృద్ధికి, ముఖ్యంగా సాఫ్ట్‌బాల్ క్రీడకు మరింత ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు.
ఈ అభినందన కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర సీఈఓ వెంకటేష్, జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, రమేష్, రాష్ట్ర మాజీ కార్యదర్శి నాగేంద్ర, సీనియర్ క్రీడాకారుడు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.