BREAKING
మండలాన్ని దట్టంగా కామ్మేసిన మంచు..! -ఓవైపు ఆహ్లాదం..మరోవైపు వినోదం..! సాంబన్న క్యాంపు కార్యాలయంలో ఏకగ్రీవ సంబరం *నూతన వధూవరులను ఆశీర్వదించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి* *జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ* 21వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం పూతలపట్టులో దట్టమైన పొగమంచు.. స్తంభించిన రాకపోకలు, భయాందోళనలో వాహనదారులు అక్కడక్కడ చిన్నపాటి ప్రమాదాలు స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత హలో నేతన్న.. చలో చేనేత భవన్ విజయవంతం చేయాలిపద్మశాలి సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ సూర్య వార్తకు స్పందన.. చవటపల్లి ముందర సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసిన ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు కౌడిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహించిన పోటీలలో విద్యార్థుల ప్రతిభ తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం జీజీహెచ్‌లో సహజ ప్రసవాలపై అవగాహన ర్యాలీ ఆత్మకూరులో "ఆనం ", "బొమ్మిరెడ్డి "ల మేలుకలయిక మలుపు తిరిగిన రాజకీయం

రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు ఇబ్బందుల్లో ప్రజానీకం

Select Suryaa Now
రాత్రులు చలి తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగ మంచు  ఇబ్బందుల్లో ప్రజానీకం

వింజమూరు, మేజర్ న్యూస్  :    వింజమూరు మండలంలో గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో చలి తీవ్రత బాగా పెరిగింది తెల్లవారుజామున మూడు నాలుగు గంటల నుండి దట్టమైన బహుమతి అమ్ముకోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం 7 8 గంటల వరకు గ్రామాల మధ్య రోడ్లపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు భయంతో నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు వింజమూరు నుంచి నెల్లూరు కావలి ఆత్మకూరు వైపు వెళ్లే విద్యార్థులు విధులకు వెళ్లే ఉద్యోగులు కూడా నానా అవస్థలు పడుతున్నారు 
రైతులు కూలీల అవస్థలు 
తెల్లవారుజామున పొలం పనులకు వెళ్లే రైతులు కూలీలు పొగముంచు కారణంగా పనులు ప్రారంభించలేకపోతున్నారు చలికి తోడు మంచు తోడు కావడంతో పంటలపై ప్రభావం చూపుతుందని ఆలోచనతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పశువుల కాపరులు కూడా ఉదయాన్నే తమ పశువులను బయటికి తీసుకు రాలేకపోతున్నారు 
వాహనదారులకు సూచన 
పొగ మంచులో వాహనాలు నడిపేటప్పుడు హెడ్లైట్లు వెలిగించి నెమ్మదిగా వెళ్లాలని అత్యవసరమైతే తప్ప ఉదయాన్నే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు 
వృద్ధులు చిన్నారులు జాగ్రత్త 
చలి పెరగడంతో వృద్ధులు చిన్నారులు జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని స్థానికులు తెలియజేస్తున్నారు ఉదయం వేళ చలిలో బయటికి రాకుండా వెచ్చని దుస్తులు ధరించి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. చల నుంచి ఉపశమనం కోసం గ్రామాల్లో ప్రజలు రాత్రి వేళల్లో చలిమంటలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు. 
కావున ప్రజలు మంచు నుండి రక్షణ కల్పించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.